మహిళా శిశువు సాధికారితే జనసేన లక్ష్యం: అతికారి దినేష్

రాజంపేట: జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ టి, సుండుపల్లి లోని జడ్పీ హైస్కూల్లో బాలికలకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ మహిళా శిశువు సాధికారితే లక్ష్యంగా ప్రతి ఆడపిల్లకు అండగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపారు. బాలిక విద్యను ప్రోత్సహిస్తామని, స్త్రీ చదువుకుంటే కుటుంబానికి వెలుగునిస్తుందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు ఆడపిల్లల, చేతుల్లో ఉందని.. ఆడపిల్లను పుట్టనిద్దాం ఆడపిల్లను బతకనిద్దాం ఆడపిల్లను చదవనిద్దాం ఆడపిల్లను ఎదగనిద్దాం అప్పుడే ప్రతి చిన్నారి దేశానికి గర్వకారణంగా తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తారని అదేవిధంగా చిన్నతనం నుంచే విద్యతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల మరియు ఇతర రంగాలలో రాణించే విధంగా వారికి చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలని సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్న ఆడపిల్లలను దైవ సమానులుగా చూడాలని అనేక వేదికలుగా పలుమార్లు ప్రస్తావించడం యువతి మరియు మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుందని తెలిపారు. జనసేనాని బాటలోనే జనసైనికులు కూడా నడుచుకుంటూ మహిళలు, వృద్ధులు, పేదల పట్ల కరుణా భావంతో మెలగాలని సూచించారు. జనసేన, టిడిపి కూటమి అధికారంలోకి రాగానే ఆడపిల్లల మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రతి ఆడపడుచుకు అండతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు సిబ్బంది మరియు జనసేన పార్టీ నాయకులు జగిలి ఓబులేష్, గోపికృష్ణ, హేమంత్, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, పాల్గొన్నారు.