ముదిగల్లులో ఎన్.డి.ఏ కూటమి ముగింపు ప్రచారం

  • ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కోసం జనసేన యుద్ధం!
  • ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపే జనసేన లక్ష్యం!
  • ఈవీఎం బ్యాలెట్ నమూనాపై అవగాహన కార్యక్రమం

కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని “ముదిగల్లు” గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు & ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణకి మద్దతుగా జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య సమక్షంలో స్థానిక టిడిపి నాయకులతో కలిసి జనసేన, టిడిపి ఉమ్మడిగా “ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి? అని అవగాహన కల్పిస్తూ ఈవీఎం బ్యాలెట్ నమూనా & బ్యాలెట్ నమూనా కరపత్రాలు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది. మరియు మేనిఫెస్టో అంశాలను కూడా ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.