ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ దూకుడు

టెస్టు మ్యాచుల్లో బజ్‌బాల్ ఆటను పరిచయం చేసి.. దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు గత కొన్నిరోజులుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో దారుణంగా ఓడిపోయింది. టీ20 సిరీస్‌ను 1-4తో కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌ను కూడా 0-3తో కోల్పోయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింది.

ఈ టోర్నీలో ఇంగ్లాండ్ గ్రూప్-బిలో ఉంది. ఇందులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్ లాంటి జట్లతో ఇంగ్లీష్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ టోర్నీలో తమ తొలి మ్యాచులో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అయితే ఈ మ్యాచ్ శనివారం జరగనుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం రెండు రోజుల ముందుగానే.. అంటే గురువారమే తమ తుది జట్టును ప్రకటించిన ఆశ్చర్యపరిచింది.

తుది జట్టులో కీలకమార్పులు చేసింది. గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్‌న తిరిగి జట్టులోకి తీసుకుంది. అతడు ఫిలిప్ సాల్ట్‌కు బదులు వికెట్ కీపర్‌గా ఉంటాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. జోఫ్రా ఆర్చర్‌ను జట్టులోకి తీసుకుంది. ఓవరాల్‌గా ఇంగ్లాండ్ తుది జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు ఉండటం గమనార్హం.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ఇంగ్లాండ్ తుది జట్టు: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కేర్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్

ఇక ఈ మ్యాచ్‌లో శనివారం పాకిస్థాన్‌ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఇంకా తుది జట్టు ప్రకటించలేదు. టాస్ సమయంలోనే ఆ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ గాయంతో ఈ టోర్నీకి దూరం కాగా.. స్టీవ్ స్మిత్ ఆ జట్టు కెప్టెన్‌గా తిరిగి నియమితుడయ్యాడు.

Share this content:

Post Comment