ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ.. ఇండియాపై భారీ స్కోరు

భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ చేయడంతో తొలి రోజు ఆ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ జోరూట్ 128 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక పర్యటనలోని ఫాంను కొనసాగించాడు. ఇతడికి ఓపెనర్ సిబ్లీ 87 పరుగులతో సహకారం అందించాడు. ఇద్దరూ రాణించడంతో ఇంగ్లండ్ తొలిరోజు ఏకంగా ఆట ముగిసే సమయానికి 263/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది.

ఇక భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు విఫలమయ్యారు. దీంతో 63 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

దీంతో బ్యాటింగ్ కు వచ్చిన రూట్.. తొలుత నిదానంగా ఆడి తర్వాత కుదురుకున్నాక పరుగులు చేశాడు. ఇద్దరూ శతకం, అర్థశతకంతో ఇంగ్లండ్ భారీగా పరుగులు రాబట్టింది. రూట్ కు సిబ్లీ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 200 పరుగులు సాధించారు. ఆఖరి ఓవర్ లో బూమ్రా సిబ్లిని ఎల్బీ డబ్ల్యూ చేయడంతో మూడో వికెట్ కోల్పోయింది.

టెస్టుపై దాదాపుగా ఇంగ్లండ్ పట్టు బిగించినట్టే. రెండోరోజు ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఇండియా భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో ఫలితం వస్తుంది. లేదంటే డ్రాగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది.