జనసేన పార్టీ ఏన్కూరు మండల కమిటీ సమావేశం

ఏన్కూరు: జనసేన పార్టీ మండల కమిటీ సభ్యుల సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏన్కూరు మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ మాట్లాడుతూ.. త్వరలోనే ఏన్కూరు మండలంలో వైరా నియోజకవర్గ ఇంచార్జ్ సంపత్ నాయక్ పర్యటన ఉంటుందని తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతం గురించి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది. మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేద్దాం అని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో మండల కోఆర్డినేటర్ కొవ్వూరి మహేష్, దామెర్ల అశోక్ కుమార్, చుంచు భాస్కర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మద్దెల పవన్ కళ్యాణ్, భాగం రవి, బీసీ సెల్ కోఆర్డినేటర్ పడిమల మురళీకృష్ణ, పసుపులేటి కృష్ణ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ బోజగాని సురేష్, ముక్తి సతీష్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ యాకూబ్ పాషా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాశం భరత్, బూరుగు రాము, దేవల నవీన్, మద్దెల రాకేష్, దేవళ్ళ వాసు తదితరులు పాల్గొన్నారు.