వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

అల్లూరి జిల్లా పాడేరు చింతపల్లి మండలం తమింగుల పంచాయితీ వర్తన పల్లి గ్రామంలో వంతల బుజ్జి బాబు, పాంగి చంటిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ పాడేరు అరకుపార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ముఖ్య అతిధిగా పాల్గొని గ్రామంలో యువతనుద్దేశిస్తూ మనరాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు యువతకు తెలుసు. ఎంతసేపు పాలకప్రభుత్వం తీరుని విమర్శించటం మా అజెండా కాదు కాని ఈ గిరిజనప్రాంతంలో నెలకొన్న అస్థిరపరిస్తితులు పరిశీలిస్తే ప్రజాపరిపాలన ఎలా సాగిస్తున్నారో అర్థం కావట్లేదు. సగటు గిరిజన రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేదు, యువతకు ఉపాధి అవకాశాల సృష్టిలేదు, అంతకంతకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, రవాణా ఛార్జీల భారం కనీసం అప్పుకూడా పుట్టని పరిస్థితి. ఇలా ఉంటే మన ప్రాంత ప్రజాప్రతినిధులు గిరిజన హక్కులపై ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై సమగ్ర గిరిజన జాతి చట్టాలపై కనీస అవగాహన లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మనం ఎన్నుకున్న మన నేతలు ఇటువంటి అవగాహన రాహిత్యంతో ఉంటే అసెంబ్లీ లో ఏం మాట్లాడగలరో మీరే అర్థం చేసుకోవచ్చు. గిరిజన నిరుద్యోగులకు కల్పతరువు జీవో నెం3 అంశాన్ని పరిశీలించి విచారణ వేగవంతం చేసేందుకు ఎందుకు కృషి చెయ్యట్లేదు? గిరిజనుల అభివృద్ధికి ఏర్పాటైన ఐటిడిఎ లో గిరిజనులకు ఉపాధి అవకాశాలు కరువు! ప్రజాలచేత ఎన్నుకోబడి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ఎలా? ప్రజలందరు ముఖ్యంగా యువత ఒక విషయం తెలుసుకోవాలి ఒకరు మామగారికి వెన్నుపోటు దారుడుగా వచ్చి పాలన చేశారు ఏమి ఒరిగిందో మనం చూసాం, ఒకరు తండ్రి తదనంతరం సానుభూతితో వచ్చారు ఏమి చేస్తున్నారో చూస్తున్నాం అనుభవిస్తున్నాం. ప్రశ్నిస్తే గొంతునొక్కే కుటిల ప్రయత్నాలు, అక్రమ కేసుల బనాయింపు, బెదిరింపులతో బరితెగింపు. జాబ్ కేలండర్ ఏమైందో మీకు తెలుసు. యువతలో రాజకీయ చైతన్యం రానంతవరకు సమస్యలపై గొంతెత్తనంతవరకు ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు! అందుకే మన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి మార్పుకోరకు శక్తివంచన లేకుండా కృషి చెయ్యాలంటు తెలిపారు. ఈ సమావేశం అనంతరం వివిధ పార్టీలకు చెందిన యువత పెద్దఎత్తున జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేనపార్టీ ఇన్చార్జ్ గంగులయ్య ద్వారా కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. అనంతరం అన్నవరం పంచాయితీ కొత్తూరుబైలు గ్రామస్తుల ఆహ్వానం మేరకు వారితో ప్రస్తుత రాజకీయలపై ఇష్ట గోష్ఠి చర్చలలో పాల్గొన్నారు. మరల లోతుగెడ్డ పంచాయితీ మేడూరు గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడ ప్రజలతో సమావేశమౌతూ పలు రాజకీయాంశలు తెలియజేస్తూ కౌలు రైతుల సంక్షేమార్థం కోసం పవన్ కళ్యాణ్ 3000 వేలమంది కౌలు రైతులకు 30కోట్లు నిధులు సహాయం అందించిన సందర్బంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, పాడేరు మండల ఉపాధ్యక్షులు సాలేబు అశోక్, మజ్జిసత్యనారాయణ, గసడి ధర్మారావు, కారుకొల వెంకట నరసిమ్హ, గిరిబాబు, చింతపల్లి నాయకులు వంతలా బుజ్జి బాబు, వీరమహిళ లావణ్య, పాంగి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.