అనంతపురం జనసేనలో చేరికలు

అనంతపురం నగరంలోని స్థానిక 42వ డివిజన్ నుండి జనసేన పార్టీ నాయకులు నజీమ్, హీద్ధూల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి అర్బన్ ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్ సమక్షంలో కండువా వేసి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇంచార్జ్ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మాట్లాడుతూ… జనసేన పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులు, యువతకు ఉపాధి అవకాశాలు లేక పడుతున్న కష్టాలు తదితర వాటి గురించి టి.సి.వరుణ్ వారితో చర్చించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత వైసిపి ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోతోందని ప్రభుత్వ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలంటే అది ఎంతో చిత్తశుద్ధి కలిగిన జనసేన అధినే పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుందని, అలాంటి పవన్ కళ్యాణ్ కి యువత అంతా బాసటగా నిలవాలని సూచించారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మీకు అన్ని విధాలుగా తాను అండగా ఉండటంతో పాటు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ మార్గంలో పయనించి పన్నుల బాదుడుతో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే జాయిన్ అయినవారు 6వ రోడ్డు చాంద్ బాషా, ఇమామ్ సాబ్, అబ్బాస్ అలీ, ముస్తఫా, సెద్ది బాషా, గౌస్, సాదిక్ వలి, మొహమ్మద్ రఫీ, సునీల్, దూదిపీరా, నాగేంద్ర, బి.నాగేంద్ర, నూర్ బాషా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు శ్రీమతి పసుపులేటి పద్మావతి, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శిలు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ నగర్ ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేశులు, దరాజ్ భాష, చోటు, నగర్ కార్యదర్శులు సువర్ణమ్మ, మురళి, సంపత్, లాల్ స్వామి, నగర సంయుక్త కార్యదర్శిలు వెంకటరమణ, ఆకుల అశోక్, నెట్టిగంటి హరీష్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.