ఎర్రగొండపాలెం జనసేనలో చేరికలు

ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామం నందు ప్రసన్నాంజనేయస్వామి వారి తిరునాల మహోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరయ్యారు. అనంతరం జనసేన పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ పాకనాటి గౌతమ్ రాజ్ మరియు ఎర్రగొండపాలెం నాయకుల ఆధ్వర్యంలో ఇమ్మడి కాశీనాథ్ సమక్షంలో జనసేన పార్టీలో 30 కుటుంబాలు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీ రామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సుబ్బారావు, పుల్లలచెరువు మండల కన్వీనర్ అచ్చయ్య, జిల్లా అధికార ప్రతినిధి భీమిశెట్టి వేంకటేశ్వర్లు, జనసేన నాయకులు తోట కాశీరావు, మల్లికార్జున, చలపతి, ఫణి మరియు ఎర్రగొండపాలెం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.