కాకినాడ రూరల్ జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం, తూరంగి గ్రామ తాపీ మేస్త్రీల సంఘ అధ్యక్షులు ముత్యం శ్రీనివాస్ నాయకత్వంలో రూరల్ మండల ఉపాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అద్దంకి వీరబాబు, పితాని శివతేజల ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో సుమారు 15 మంది వివిధ మేస్త్రి సంఘాల ప్రతినిధులు జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు.