ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ పాల్గొనడం జరిగింది. అనంతరం ఆయన నాయకులతో మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను, ప్రజలకు బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క జనసైనికుడు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఎర్రగొండపాలెంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పదిమందితో కూడిన సమన్వయకర్తలను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా సంయుక్త కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.