187 పోస్టుల భర్తీకి ESIC నోటిఫికేషన్

ప్రముఖ ఈఎస్‌ఐసీ సంస్థ  హైదరాబాద్‌లో 187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 187

పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ, అడ్జంక్ట్ ఫ్యాకల్టీ, సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్స్, కన్సల్టెంట్స్, సీనియర్ రెసిడెంట్స్, రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్స్.

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్తీషియా తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వాక్ ఇన్ తేదీలు: నవంబర్ 25, 2020 నుంచి డిసెంబర్ 17, 2020 వరకూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22, 2020.

పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్: https://www.esic.nic.in