రాజాం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

రాజాం నియోజకవర్గం పట్టణ జనసేన నాయకులు నమ్మి దుర్గారావు ఆధ్వర్యంలో బుచ్చింపేట సెంటర్ వద్ద ప్రయాణికులకు దాహం తీర్చేందుకు
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నమ్మి దుర్గారావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు తన ఆశయాలకు అనుగుణంగా, ప్రజాసేవ ధ్యేయంగా, మానవత దృక్పథంతో, పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని, దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కర్ణం జయకృష్ణ, మాసాబత్తులు హరిబాబు, నాగరాజు, దత్త ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.