అట్టహాసంగా ఓ డి సి ఆమడగురులో జనసేన కార్యాలయాల ఏర్పాటు

  • ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్
  • పుట్టపర్తి ఇన్చార్జి పత్తి చంద్రశేఖర్ కు ఘన సన్మానం

అనంతపురం: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడిసి అమడ గూడూరులో మండల కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, పుట్టపర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ జనసేన పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పుట్టపర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ రెండు మండలాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. అనంతరం పత్తి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వర్, తాడిపత్రి ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి, ఐటీ వింగ్ పుట్టపర్తి ఇన్చార్జి విష్ణువర్ధన్, ఒడిసి మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, ఆమడుగురు మండల అధ్యక్షులు బాలసపల్లి ఆంజనేయులు, ఇతర మండలాల అధ్యక్షులు పూల శివప్రసాద్ పెద్దన్న జయరాం మల్లేష్ పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.