ఈటల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్..!

హుజూరాబాద్ గడ్డపై కాషాయజెండా ఎగరేసి.. కేసీఆర్ ను ఢీకొట్టి నిలబడ్డ ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి.

ఈటల ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరుసార్లు టీఆర్ఎస్ తరఫున గెలవగా.. ఏడోసారి బీజేపీ గుర్తుతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.