జనసేనాని జన్మదిన వేడుకల ఏర్పాట్లలో బాగంగా ఎచ్చెర్ల జనసేన సమావేశం

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ కేంద్రకార్యాలయంలో నిర్వహించినటువంటి నాయకులు, జనసైనికులు సమావేశంలో ముఖ్యంగా రాబోవు సెప్టెంబర్2 వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ప్రతీ గ్రామంలో ఉన్న జనసైనికులకు, అభిమానులకు నాయకులకు ఈ జన్మదిన వేడుకలు నుండే ప్రతీ గ్రామంలో పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, కొన్ని అంశాలను నియోజకవర్గ నాయకులు కాంతిశ్రీ తెలిపారు….అవి

  • ప్రతీ గ్రామంలో జనసేనపార్టీ జండా ఆవిష్కరణ జరగాలి.
  • గ్రామాల్లో ప్రజలు జనసేనపార్టీలో చేరికలు ఉండే విధంగా చెయ్యాలి
  • ఫ్లెక్సీలు కట్టేటపుడు సినిమాల్లో ఫొటోలు కాకుండా రాజకీయ ఫొటోలు వెయ్యాలి,
  • జనసేనపార్టీ సిద్ధాంతాలు.., !! షణ్ముఖహ్యుహం, మేనిఫెస్టో….!! కౌలు రైతులకు30 కోట్లు..!! గాజుగ్లాస్, ఇతర సేవా కార్యక్రమాలు వంటివి ఫ్లెక్సీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి…

అలాగే మిగతా కార్యక్రమాలు నిర్వహించే వారు ముందుగా తెలియజేయాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంలో భాగంగా కేంద్రం పెట్టిన ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ప్రతీ గ్రామంలో పేదవారికి గుర్తించి వారికి గ్యాస్ అందిస్తున్న జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కూడా వారి సలహాలు సూచనలు తెలియజేసారు.