గుమ్మడం పంచాయతీలో ఎచ్చెర్ల జనసేన టీం పర్యటన

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుమ్మడం పంచాయతీలో ఎచ్చెర్ల జనసేన టీం పర్యటించారు.. పర్యటనలో భాగంగా గుమడం పంచాయతీలో ఎస్సీ కాలనీలో విలయతాండం చేస్తున్నటువంటి సమస్యలు మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, కాలనీ ఇళ్ల సమస్య, సీసీ రోడ్ల సమస్య, మరుగుదొడ్లకు సంబంధించి బిల్లుల సమస్య… అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య. అదేవిధంగా ప్రధానంగా వలస సమస్య. ప్రతి ఒక్కరి సమస్యను జనసేన టీం తెలుసుకొవడం జరిగింది. సమస్యలను పై స్థాయి అధికారులకు తెలియజేస్తామని అదేవిధంగా సమస్యల పరిష్కార దిశగా పోరాటం చేస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల జనసేన టీం నాయకులు భూపతి అర్జున, తమ్మినేని శ్రీనివాస్, బొంతు విజయ్ కృష్ణ, బొంతు రామకృష్ణ, స్థానిక యువత చలపతి రావు, పైడి రాజు, గ్రామ పెద్దలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.