*నల్లగొండ్రాయనపల్లి రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది
*త్వరలోనే అన్నయ్య చిరంజీవిని రామకృష్ణ కలుస్తారు
*దీక్ష విరమింప చేసిన చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్
అనంతపురం, మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి తన ప్రతి అభిమానిని ఆత్మబంధువుగా భావిస్తారు. అభిమానులు అంటే ప్రాణమిచ్చే ఆయన అభిమానుల కోసం ఏం చేసేందుకైనా వెనకాడరని అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్, భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ అన్నారు. గత మూడు రోజులుగా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి రామకృష్ణ చిరంజీవి దర్శనం కోరి దీక్ష చేపట్టారు. చిరంజీవిని తన ప్రాణం కన్నా మిన్నగా అభిమానించే రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమాను 30 సార్లు చూసేవాడినని.. ఆయన సినిమా రిలీజ్ అయితే ఓ పండగల చేసేవాడినని అన్నారు. చిరంజీవిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కలవలేకపోయానని.. ఆయనను కలిసి తాను రాసిన జానపద కథ చెప్పాలని.. మెగాస్టార్ చిరంజీవిని చూడడమే తన చివరి కోరికగా నిరాహార దీక్ష చేపట్టానన్నారు. అయితే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్, అఖిలభారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు భవాని రవికుమార్ లను రామకృష్ణ వద్దకు పంపించి, దీక్ష విరమింప చేశారు. త్వరలోనే రామకృష్ణను మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తామని వారు తెలపడంతో రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తన కోరిక నెరవేరుస్తున్నందుకు రవణం స్వామి నాయుడు, మహేష్, భవాని రవికుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమాని హిందూపూర్ జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, పెనుకొండ నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు చిలమత్తూరీ వెంకటేష్, జనసేన పార్టీ మండల కన్వీనర్ జబీవుల్లా షేక్, గోరంట్ల చిరంజీవి యువత మండల అధ్యక్షుడు మను. సోమందేపల్లి ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, కొల్లప్ప, ప్రధాన కార్యదర్శులు నడింపల్లి నరసింహమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఖాసీం, జనసేన నాయకులు గంగాధర్ రాయల్, తరుణ్, వెంకటేష్, హరీష్, వీర మహిళలు శిరీష, సుమిత్రా రాయల్, వరలక్ష్మి జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment