ప్రతి ధాన్యపు గింజ రైతు వద్దకే వెళ్లి ప్రభుత్వం కొనుగోలు చేయాలి

  • జనసేన నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్

పలాస: గత ఏడాది పంటలు బాగా పండినా ప్రభుత్వం రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలం చెందారు. శనివారం నియోజకవర్గంలో నష్టపోయిన పొలాలను పరిశీలించి, నష్టపోయిన కొంతమంది రైతులతో మాట్లాడి రైతులతో మాట్లాడి తదుపరి ఈ సంవత్సరం వర్షాలు లేక చాల వరకు నీరు అంధక అధిక పంట నష్టం జరిగింది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో అన్నింటినీ కరువు మండలాలుగ ప్రకటించాలి అని కోరుతూ మిగిలిన అరకొర భూములకి కూడా ఈ సారి పంట కోసం పెట్టుబడి అధికం అయింది. అందుచేత రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ధాన్యం అమ్మెందుకు మరింత భారం పడ్తున్న కారణంగా రైతు నిల్వఉంచిన ప్రదేశానికే ప్రభుత్వం వెళ్లి కొనుగోలు చేసి రైతుకు పెట్టుబడి భారం తగ్గించవల్సిందిగా పలాస రెవెన్యూ డివిజన్ ఆర్.డి.ఓ గారి ద్వారా ప్రభుత్వానికి రైతుల పక్షాన జనసేన పార్టీ తరుపున నివేదిక రూపంలో విన్నవించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్, రిటైర్డ్ ఎస్.ఐ కొన కృష్ణ రావు, జనసేన జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు, గిరి బాబు, కిరణ్ తదితరులు వున్నారు.