పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

ఆలూరు, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క జనసైనికుడు కృషి చేయాల్సి ఉందని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. జనసేన పార్టీకి తలపెట్టిన ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన
కార్యకర్త పాల్గొనాలని, టాము చేసే కార్యక్రమాలలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని కలుపుకుని పనిచేస్తామని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజలలి తెలియజేయలని అన్నారు. వైసిపి పాలకులు నాయకులు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని చెబుతున్నారు. సంక్షేమ పథకాలు వలన ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా చెప్పగలరని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి విమర్శించారు. సంక్షేమ పథకాలు వల్ల ఉపాధి లేని గ్రామాలలో వలసలను నివారించగలరా అని అన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు నగరాలకు తరలిపోతున్నారు. కోసిగి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, హోళగుంద, కోడుమూరు మండలాల నుంచి తెలంగాణ బెంగళూరు, గుంటూరు, ముంబైలకు తరలి వెళ్తున్నారు. అకాల వర్షాల వల్ల సరైన దిగుబడి లేక పూర్తిగా నష్టం వాటిల్లితే కూలీలతో పాటు సన్న చిన్న కారు రైతులు కూడా వలస వెళ్తున్నారు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే సంక్షేమ పథకాలు వల్ల ప్రజల్లకు మేలు జరుగదని ఉపాధి లేని గ్రామాలలో ఉపాధి కల్పించినపుడే మేలు జరుగుతుందని అన్నారు. ఆలూరు నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాలలో త్రాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. నాయకులు, అధికారులు చీమకుట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించేలా ప్రజలతో కలిసి పోరాడుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.