ప్రతీ ఒక్క వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు నోరు అదుపులో పెట్టుకోవాలి

🔸 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చిన జనసేన నాయకులు
🔸 కొండకరకాం జగనన్న ఇళ్లు, కొండవెలగాడ టిట్కోఇళ్లు జనసేన నాయకులు సందర్శన
🔸 నాణ్యత లేని, గొయ్యలు తీయకుండానే జగనన్న పునాదులు
🔸 లోపంకోసం నిలదీసిన జనసేన నాయకులపై హౌసింగ్ ఏఈ, సచివాలయం సిబ్బంది మాటలదాడి

విజయనగరం, 12,13,14 తేదీల్లో ఈ జగనన్న ఇళ్లల్లో మోసాలను ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడో రోజైన సోమవారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గంలో కొండ వెలగాడలో ఉన్న టిడ్కో ఇళ్ళు, కొండకరకాంలో జగనన్న లేఅవుట్ ను జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు,జమ్ము ఆదినారాయణ, రౌతు సతీష్, లాలిశెట్టి రవితేజ, ఏర్నాగుల చక్రవర్తి, పొట్నూరు చందు, పిడుగు సతీష్, త్యాడ రామకృష్ణారావు (బాలు), వీర మహిళల గంట్లాన పుష్పకుమారి, పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం గోయ్యలు తీయకుండా, నాణ్యత లేకుండా తీస్తున్న జగనన్న పునాదులను చూసి అవాక్కయ్యి, ఏంటండీ ఈ ఘోరం అనిఆడుగుగా వెంటనే హౌసింగ్ ఎ.ఈ, సచివాలయం సిబ్బంది జనసేన నాయకులపై విరుచుకుపడ్డారు. చివరకు వారిచ్చిన లక్షా ఎనభై వేలకు ఎలా కట్టమంటారు అని ఆఖరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు ఏలాచెబిటే అలా చేయాలని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో పాటు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర,పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ రావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జెడ్.పి చైర్ పర్సన్ చిన్న శ్రీను, ఎమ్మెల్సీ సురేష్ బాబు పవన్ కళ్యాణ్ పై అవగాహన రాహిత్యంతో, పవన్ జన ప్రభంజనాన్ని తట్టుకోలేక, వైఎస్సార్సీపీ జగనన్న ఇళ్ళల్లో జరిగిన కుంభకోణాన్ని బయట పెట్టేసరికి కుక్కల్లా మోరిగారని, ఈ మొరిగిన ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. జిల్లా మొత్తం 55,5523 జగనన్న ఇల్లులు మంజూరుకాగా,నిర్మాణం చేపట్టిన 51,119 కీ ఇప్పటికీ కట్టిన ఇళ్ళులు కేవలం 3,647 ఇళ్లులు మాత్రమే అని,మిగతా సుమారు 48వేల ఇళ్లులు ఎన్ని సంవత్సరాలకు ప్రజలకు అందించ గలరని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన లక్షలకోట్లు ఏచేసారని, జగనన్న కాలనీల్లో కొలాయిలు, రోడ్లు, కాలువలు, బ్రిక్, కార్మికుల కాంట్రాక్టర్లు, ఎవరెవరిని పెట్టారో పేర్లతో సహా బయట పెట్టగలరా అని వైసిపి నాయకులపై దుయ్యపట్టారు. సినిమా టిక్కెట్లు అమ్ముకొని ఎలా నాయకులు అయ్యారో, సారా వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు, బినామీ కాంట్రాక్టర్లు పెట్టుకొని ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో జనసేన త్వరలో ప్రజలందరికీ తెలిసేలా జనసేన పోరాటం చేస్తుందని వైసిపి నాయకులకు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ జగనన్న ఇళ్లపై పోరాటం మరింత ఉదృతం చేస్తామని అన్నారు.