ఇమ్మడి కాశీనాధ్ పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర మూడవ రోజు కొనకనమిట్ల గ్రామం నుండి బయలుదేరి పొదిలికి పట్టణానికి చేరుకోవడం జరిగింది. అనంతరము పొదిలి చెక్ పోస్టు నుండి పొదిలి టౌన్ నందు పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ కందుల నారాయణరెడ్డి వారి నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రలో పాల్గొని వారి యొక్క మద్దతుని తెలియజేశారు. ఈ పాదయాత్రకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.