పొన్నలూరు జనసేన కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం: మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కి జనసేన అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ పొన్నలూరు మండలంలో జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెదపూడి విజయ్ కుమార్ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు షేక్ రియాజ్, మరియు రాష్ట్ర అధికార ప్రతినిధులు మరియు వీరమహిళలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామని మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.