పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండలో పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జయకృష్ణ మరియు జి.సి.సి ఛైర్మన్ కిడారి శ్రవణ్ హాజరై కూటమి అభ్యర్థి విజయానికి మద్దతు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించేలా అందరూ కలిసి పనిచేయాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు చేసిన అన్యాయాన్ని బలంగా ప్రచారం చేయాలని సూచించారు. జీతాలు ఆలస్యం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఉపాధ్యాయులకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబ సాధికార సారథులను(కె.ఎస్.ఎస్) బలోపేతం చేయాలి అని ఆమె సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో “కుటుంబ సాధికార సారథులు” (కె.ఎస్.ఎస్) కీలక భూమిక పోషించనున్నారు. ప్రతి ఉపాధ్యాయుని కుటుంబ సభ్యుల ద్వారా ప్రచారం విస్తరించి, ఉపాధ్యాయుల సమస్యలు సామాజిక మద్దతుగా మారేలా చూడాలని అన్నారు.
Share this content:
Post Comment