*జనసేన పార్టీ జిల్లా నాయకులు సనత్ కుమార్
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ ప్యాడ్‌లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను భూపాలపల్లి జిల్లాలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జనసేన నాయకుడు కాల్వ రాజశేఖర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదుగుతోందని, రాజకీయ విలువలతో, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా సామాన్యులకు ఆశాజ్యోతి చూపిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో శేషజ్వాల రాజేష్, పైడిమల్ల రాజు, పోలోజు అవినాష్, నారా రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment