అధిక పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం: పల్లె పోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, అధిక పన్నుల రూపంలో ప్రజలను లూటీ చేస్తున్న ప్రబుత్వనికి ప్రజలు తమ ఓటు రూపంలో బుద్ది చెప్తారని తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక కొండ్రుప్రోలు మెట్ట కె.ఎస్.ఎన్ కాలనీలో బుధవారం పల్లె పోరు జరిగింది ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ప్రజల జీవనం అస్తవస్త అయిందన్నారు. 300 యూనిట్లు విద్యుత్ వాడకం దాటితే సంక్షేమ పథకాలు తీసేయడం దారుణం అన్నారు. అనంతరం అక్కడ జరిగిన సభకు పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షత వహించారు. సుమారు 100 మంది బిసి వడ్డెర సంఘ సభ్యులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీను మాట్లాడుతూ బిసి సంఘాలను కులాల పేరుతో విడదీసి సంఘ చైర్మన్లు డైరెక్టర్లు అంటూ పదవులు మాత్రమే ఇచ్చి వారి సంక్షేమము మరిచారన్నారు, నిధులు లేకుండా కార్పొరేషన్లుగా విడదీశారన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అద్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు వి.వెంకట్రావు, డి.గురుమూర్తి, బి.వెంకటేశ్వరరావు, టి.అంజి, మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పైబోయిన వెంకట్రామయ్య, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, అధికారిక ప్రతినిధి సజ్జా సుబ్బు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, జిల్లా నాయకులు కసిరెడ్డి మధులత, రామిశెట్టి సురేష్, యాంట్రపాటి రాజు, కొనకల్ల హరినాథ్, మద్దాల మణికంఠ, జనసేన నాయకులు, మదాసు ఇందు, రౌతు సోమరాజు, అడబాల మురళి, చాపల రమేష్, మారిశెట్టి పోతురాజు, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, లింగం శ్రీను, యువర్న సోము, అత్తిలి బాబీ, గట్టిం నాని, సోమాలమ్మ, అడపా జమున, పసుపులేటి లక్ష్మి, తోట ధనలక్ష్మి, గువ్వ వెంకటలక్ష్మి, గొట్టుముక్కల రమాదేవి జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.