మధ్య నిషేధం పేరుతో వేల కోట్ల దోపిడీ

నెల్లూరు, దశల వారీ మధ్య నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ నిషేధం ఎత్తకపోగా జె బ్రాండ్స్ పేరుతో నాసిరకం మద్యం అమ్మి వందల మంది మరణానికి, వేల మంది అనారోగ్యానికి కారణం అయ్యారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్.డి.ఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి కనుసన్నల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థుల కోసం మద్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని వెంటనే వాసుదేవారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. జె గ్యాంగ్ అడ్డు అదుపు లేకుండా బ్లాక్ లో మద్యం విక్రయాల పేరిట దోపిడీ చేస్తూ తాడేపల్లిగూడెంకు తరలించి అక్కడ నుంచి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల కోసం పంచేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా మరో 20 ఏళ్లు తాకట్టు పెట్టిన చెత్త సిఎం జగన్ మోహన్ రెడ్డి అని, రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మనోజ్ కుమార్, జనసేన, టీడీపీ నాయకులు ఇంద్రవర్ధన్, చంద్రనీల్, సాయి, శ్రీనాథ్, రహీం, ఇజ్రాయేల్ కుమార్, శంకర్ పాల్గొన్నారు.