అదనపు సొమ్ముతో సొంతిల్లు సాకారానికి ఊతం

*నాడు ఊళ్లు క‌డుతామ‌ని ఊద‌ర గొట్టి, న‌ట్టేట ముంచారు
*జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిలకలూరిపేట:’కాలనీలు కాదు.. ఊళ్లే వస్తున్నాయి’ అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన హామీతో సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన పేదలకు నిరాశే ఎదురైందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనవాసాలకు దూరంగా సెంటు స్థలం కేటాయించి ఊర్లు ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నప్పటికీ, నేటికీ గృహనిర్మాణాలు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఊర్లు నిర్మిస్తామని చెప్పి పేదలకు వాస్తవంలో మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపు కావడం వల్ల పేదల సొంతింటి కల నెరవేరలేదని, ఇళ్లు మంజూరు అయినా ఐదేళ్లుగా నిర్మాణాలు పూర్తి కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. లేఅవుట్లలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన గృహనిర్మాణ పనులు బిల్లులు తీసుకున్న తరువాత మధ్యలోనే నిలిచిపోయాయని వెల్లడించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా మంత్రి విడదల రజనీ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పెరిగిన ధరలతో పేదలు అప్పులతో మరింత సంక్షోభానికి గురవుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గృహనిర్మాణాలను వేగవంతం చేయడంపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని బాలాజీ స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి భారాన్ని తగ్గించేందుకు ఎస్సీ, ఎస్టీలతోపాటు చేనేతలకు అదనపు ప్రయోజనాలు అందించనున్నట్లు తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే మంజూరు చేసినట్లు గుర్తుచేస్తూ, కూటమి ప్రభుత్వం అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, చేనేతలు మరియు బీసీలకు రూ.50 వేలు సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Share this content:

Post Comment