F2 టీంతోనే F3..

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్లుగా స్క్రీన్‌పై సందడి చేసిన సినిమా ‘ఎఫ్‌ 2’ (‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’). అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కించబోతున్నట్టు అనిల్‌ రావిపూడి ఆ మధ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కామెడి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీని కూడా ప్రేక్షకుల అందించడంలో అనీల్ రావిపూడిది అందెవేసిన చేయి అనడంలో ఆయన తీసిన చిత్రాలే నిదర్శనం అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో కూడా ఎమోషనల్ టచ్ తో పాటు కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని కూడా అందించారు. మల్టీస్టారర్ తో అనీల్ తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం గురించి వేరే చెప్పనవసరమే లేదు. ఫ్యామిలీ ఆడియన్సు కి 2019 సంక్రాంతి ట్రీట్ అదిరిపోయింది. కాగా ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ అనీల్ రావిపూడి – ప్రముఖ నిర్మాత దిల్ రాజు బృందం అధికారికంగానే ప్రకటించారు.

అయితే ఎఫ్ 3 పై పని కూడా మొదలు పెట్టారట అనీల్ రావిపూడి. కానీ ఎఫ్ 3 ప్రారంభమయ్యేదెపుడు.. అంటే దానిపై ఇప్పటివరకూ ఎవరూ ఏ క్లారిటీని ఇవ్వలేదు. ఎఫ్-3పై హీరో విక్టరీ వెంకటేష్ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో దర్శకుడు అనిల్ రావిపుడి కొత్తవారితో ఒక చిత్రాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు పలు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవీ నిజాలు కాదని..

ఎఫ్ 3 కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సేమ్ టీమ్ తోనే ఎఫ్ 3కి పని చేయనున్నారట. 2021 జనవరి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శకుడు భావిస్తున్నారట. అప్పటికి వెంకీ ..వరుణ్ తేజ్ ప్రస్తుత సినిమాల్ని పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అనీల్ రావిపూడి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారని సమాచారం. ఐదు నెలల్లోనే వేగంగా పూర్తి చేసి… 2021 వేసవి చివరలో విడుదల చేయాలన్నది ప్లాన్.