కేసీఆర్‌కు ఈటల లేఖ కలకలం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈటల వర్గీయులు

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడానికి ముందు తనపై వచ్చిన అభియోగాలకు సంజాయిషీ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు మాజీ మంత్రి ఈటల రాసినట్టుగా చెబుతున్న లేఖ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన ఈటల వర్గీయులైన బీజేపీ నేతలు దీనిని కొట్టిపడేశారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిని ఉద్దేశపూర్వకంగా పుట్టించారంటూ కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈటలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ లేఖను రూపొందించిన వారితోపాటు దానిని వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చశారు. ఈటల ఎప్పుడూ తన లెటర్ ‌ప్యాడ్‌పై తెలుగులో ఏ విషయాన్నీ రాయలేదని అందులో పేర్కొన్నారు.