మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన

మదనపల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మదనపల్లె నియోజకవర్గపరిధిలోని కొండామరి పంచాయితీలోని కొండ చివరన జగన్ కాలనీలను శనివారం జనసేన నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్లు కేటాయించిన స్థలంలోని పరిస్థితి.. ఇక్కడ ఇచ్చిన స్థలంలోనే వంక పోతోంది పక్కన హైపవర్ స్టేషన్ వుండటం. ఏటవాలు ప్రాంతం అవటం వలన ఆ నీరు ఈ కాలని గుండా ప్రవహించే ప్రమాదం వుంది. పొరపాటున పవర్ సప్లయ్ ప్రవహిస్తే కాలని వాసుల పరిస్థితి ఏమిటని ప్రష్నించారు. ఈ స్థలం మానవ నివాసానికి అనువైనది కాదు. ఇలాంటి ప్రదేశంలో పేదలకు ఇల్లు కేటాయించి ప్రభుత్వ మోసాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపిన మదనపల్లె జనసేన నాయకులు శ్రీ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు దారం హరి ప్రసాద్, కిరణ్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, రెడ్డి హర్ష, అశ్వత్, స్వాతి, అయాజ్ తదితరులు పాల్గొన్నారు.