తగ్గుతున్న పసిడి ధరలు

బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతున్నవిషయం తెలిసిందే. గత నెల కాలంలోనే బంగారం ధర ఏకంగా రూ.10వేలకు పైగా పెరిగింది. ధర పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ ఊరటనిస్తుంది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.58,470కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గడంతో రూ.53,580కు దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.940 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.75,150కి చేరింది. ఇందుకు ప్రధాన కారణo పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం.