- కోర్టు వాయిదాకు హాజరైన జనసేన, భాజపా నేతలు
మదనపల్లె, 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలు, దేవతల విగ్రహాలు కూల్చివేతలకు నిరసనగా జనసేన, భాజపా ఉమ్మడిగా నిర్వహించిన ధర్నాలు, నిరసనల నేపథ్యంలో జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసుల విచారణ కోర్టులో జరుగుతోంది. ఈ నేపథ్యంలో, నేడు లాయర్ బాల జ్యోతి సూచన మేరకు కోర్టు వాయిదాకు మదనపల్లె జనసేన పార్టీ, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, డా.సుబ్బారెడ్డి, జర్మన్ రాజు, కిరణ్, బాలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “హిందూ ఆచారాలు, దేవుళ్లను పట్టించుకోని వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్ పట్ల హిందువుల తీవ్ర అసంతృప్తి ఉంది. ఆలయాలపై దాడులకు సంబంధించి ప్రశ్నించినందుకే మాపై అక్రమ కేసులు నమోదు చేశారు” అని తెలిపారు. జనసేన పార్టీ తమ హక్కుల కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆగకుండా పోరాడుతుందని స్పష్టం చేశారు.
Share this content:
Post Comment