*గాదె వెంకటేశ్వరరావు
చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల గ్రామానికి చెందిన నాశం ఆదినారాయణ, తూబాడు గ్రామానికి చెందిన సిరి బోయిన గోపాలరావు అనే మిరప, పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటనపై ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన, జనసేన సమన్వయకర్త తోట రాజ రమేష్, మండల ఉపాధ్యక్షుడు దడదాసుల శరత్, ఇతర మండల నాయకులతో కలిసి బాధిత రైతుల కుటుంబాలను పరామర్శించారు. రైతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గాదె వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతులను కాపాడాల్సిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుభాని, పట్టణ నాయకులు మునీర్ హసన్, మండల నాయకులు రామారావు, పత్తి సాంబ, హర్షవర్ధన్, జగదీష్, రమణయ్య, యోబు, అచ్చు, కోల వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment