రైతే దేశానికి వెన్నెముక.. రైతు దినోత్సవ వేడుకలలో రాజోలు జనసేన

  • రైతే రాజు.. రైతు దేశానికి వెన్నుముక..
  • విపరీతమైన సంక్షోభంలో కూడా నిలదొక్కుకొని ఉంటున్నాం అంటే కారణం మనది వ్యవసాయాధారిత దేశంగా ఉండటం
  • నేడు రైతులు ఎక్కడా సుఖసంతోషాలతో లేరు
  • వారు ఒక ప్రక్క ఆర్థికంగా ఇబ్బందులుతో సతమతం అవుతుంటే, మరొక ప్రక్క ఈ ప్రభుత్వం విధానం మరింత ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నారు
  • కౌలు రైతుల పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది, ప్రభుత్వ సహాయం అందక ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తుంది
  • వారికి భరోసా నింపడం కోసమే జనసేన పార్టీ ప్రయత్నిస్తుంది
  • అధికారం లేకపోయిన మా అధ్యక్షులు కష్టార్జితం వారికి దారపోస్తున్నారు
  • అధికారం వస్తే రైతులకు ఫించన్ ఇస్తాము అని చెప్పిన పార్టీ జనసేన పార్టీ

రాజోలు: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆదేశాలు మేరకు రాజోలు నియోజకవర్గం స్థాయిలో సఖినేటిపల్లి మండలం, శృంగవరప్పాడు గ్రామంలో సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల కుమార్ ఫణి కుమార్ అధ్యక్షతన శృంగావరపాడు గ్రామ శాఖ అధ్యక్షులు ఎనుముల సూర్యప్రసాద్, మోరి గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులును సన్మానించి, వారు చేస్తున్న కృషితో పాటు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. రైతే దేశానికి వెన్నుముక అలాంటి రైతు నేడు ఒక ప్రక్క ఆర్థిక ఇబ్బందులుతో, ప్రకృతి వైపరీత్యాలుతో సతమతం అవుతుంటే మరొక ప్రక్క ప్రభుత్వ విధానాలుతో నలిగిపోతున్నారు. ప్రపంచ దేశాలు అన్ని ఆర్థిక మాంద్యం, కరోనా వంటి విపరీతమైన సంక్షోభాలతో దెబ్బతింటే మనది వ్యవసాయాధారిత దేశం కనుక అలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం‌ అంటే రైతే కారణంగా చెప్పుకోవాలి. కానీ నేడు రైతులకు సరైన ప్రభుత్వం సహయం అందటం లేదు. పంటకి గిట్టుబాటు ధర దొరకడం లేదు. రోజులు తరబడి పండించిన పంట గట్టులు మీదే ఉంటుంది. పంట అమ్ముకోవడానికి రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. కౌలు రైతు పరిస్థితి అయితే మరి దయనీయంగా ఉంది. ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా వారికి కనిపిస్తున్నాయి. అలాంటి వారికి భరోసా నింపడం కోసమే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. జనసేనకు అధికారం లేకపోయిన అయన కష్టార్జితం కౌలు రైతులు కుటుంబాలకు ఖర్చు చేస్తున్నారు. అధికారం వస్తే రైతుకు ఫించన్ ఇస్తుంది అని చెప్పిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీనే. వచ్చేసారి జనసేన పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుభోగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, గేడ్డం మహాలక్ష్మి ప్రసాద్, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, మండలాధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, మల్లిపూడి సత్తిబాబు, జాలం శ్రీనివాసరాజు, ఎంపీపీ మేడిచర్ల రాము, ఎంపీటీసీలు జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, ముత్యాల సాయిరాం ఉండపల్లి అంజి, రావూరి నాగు, తాడి లలిత, రావి అంజనా దేవి, మండల కమిటీ సభ్యులు జిల్లెల్ల నరసింహారావు, కాటన్ పాడు నాగేంద్ర, మాలే కాళిదాస్, పోతు కృష్ణ, రేకపల్లి శ్రీనివాస్, సాధనాల వెంకన్న బాబు, కుసుమ నాని, బందెల శరత్, బెల్లంకొండ పుత్రయ్య, కడలి శ్రీరామచంద్రరావు, మద్దాల మురళి, లక్ష్మణరావు, ఉల్లంపర్తి దర్శనం, అప్పాజీ, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.