రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం చొల్లంగి, చొల్లంగిపేట జి వేమవరం, మరియు పలు గ్రామాల్లో మిచాంగ్ తుఫాన్ కారణంగా కురిసిన కుంబవర్షాలకు పంటనష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు వెంటనే పంట నష్టపరిహారం 20 నుండి 25 వేలు ఇప్పించాలని, పంట భీమా వర్తించేలా చూడాలని 75 కేజీలు 1637 రూపాయలు సాధారణ రకం, ఎ గ్రేడ్1652 రూపాయలు బేషరతుగా కొనుగోలు చెయ్యాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. అలాగే మురుగు కాలువలకు పూడికలు వెంటనే తీయించాలని డిమాండ్ చేశారు. వీరివెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, జి వేమవరం ప్రెసిడెంట్ పుణ్యమంతుల సూరిబాబు, వెలుగుబంట్ల సూరిబాబు, దూడల స్వామి, పెన్నాడ శివ, అంకన ఆంజనేయులు, కనకాల పెదబాబు, సుందరపల్లి సత్యనారాయణ, నరాల రామకృష్ణ, శ్రీపాదం వీరభద్ర వీరభద్రరావు, దుల్ల అజయ్, పుణ్యమంతుల సత్తిబాబు, రేలంగి శ్రీనివాస్ గౌడ, కే రాజేష్, కొమ్మలు సుబ్రమణ్యం, యర్రమనీడి తణుకుల రాజు, (వై టి ఆర్) కందుల సత్తిబాబు, అధిక సంఖ్యలో రైతులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.