రైతులకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలి

  • జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం, చెల్లంపేట గ్రామం మరియు మీర్తీ వలస అంప్ప విల్లి నూకలవాడ నారాయణపురం గ్రామాలలోని రైతుల వ్యవసాయ బోర్ లకు విద్యుత్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్లు, గత వారం రోజులు కిందట అకాల వర్షానికి పిడుగు పాటు తో పాడైపోయాయి, వెంటనే వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయవలసిందిగా బలిజిపేట మండల ఏ ఈని కోరడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి వీలైనంత త్వరగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల నాయకుడు బంకురు పోలినాయుడు, పరుచూరి వెంకటరమణ, నారాయణపురం జనార్దన్ నాయుడు, శివ మామిడి మార్కండేయులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధ్యక్షుడు బాబు పాలూరి, పార్వతీపురం నియోజవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు, పార్వతిపురం జిల్లా నాయకులు, గంటేడ స్వామి నాయుడు, రఘుమండ్ల అప్పలనాయుడు, తెర్లా మండల అధ్యక్షులు మరడాని రవి, బొబ్బిలి నియోజకవర్గం నాయకులు, సీమల సతీష్, మొదలగువారు పాల్గొన్నారు. కష్టం ఎక్కడ ఉంటే జనసేన అక్కడ అండగా ఉంటుందని మరొకసారి నిరూపించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు.