విజయవాడ వెస్ట్ లో శరవేగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

  • అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళులు

విజయవాడ వెస్ట్: 40వ డివిజన్ లో బ్యాంక్ సెంటర్, ఎన్టీఆర్ స్ట్రీట్, మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఎం.హనుమాన్, దుర్గారావు, నాగార్జున, శ్యాం సుందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఇంచార్జ్, నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విచ్చేసి సభ్యత్వ నమోదును పరిశీలించినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు భరోసా, భద్రత, భవిష్యత్తును కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారని, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కేవలం 500 రూపాయలతో సభ్యత్వం పొందితే కార్యకర్తలకు 5లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు 50వేల రూపాయల ఆసుపత్రి ఖర్చులు వర్తించేలా క్రియాశీలక సభ్యత్వ నమోదును రూపొందించారని, విజయవాడ నగరంలో ఇప్పటికే నాలుగువేల పైచిలుకు సభ్యత్వాలు నమోదు పూర్తి చేశామని పార్టీ ఇచ్చిన నిర్దిష్ట సమయంలోగా పదివేల పైచిలుకు సభ్యత్వాలు విజయవాడ నగరంలోని నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు సంపూర్ణ సహాయ సహకారాలతో నమోదు చేస్తామని, ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కెంద్రాల వద్దకు వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఇదే మార్పుకు సంకేతమన్నారు. గతంలో మొదటి విడత 18, రెండవ విడతలో 50 సభ్యత్వాలు మాత్రమే జరిగినాయని కానీ ఈ సారి ఈ డివిజన్లో ఇప్పటికే 80 సభ్యత్వాలు నమోదు పూర్తి చేసామని, అతి తొందరలో 200 సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక నాయకులు హనుమాన్, దుర్గారావు, నాగార్జున, శ్యాంసుందర్లు తెలియజేశారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనాతో కలిసి అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.