నరవ కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకొని రావడానికి 24 గంటలు నిరాహార దీక్ష

పెందుర్తి: నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం లో గల కళ్యాణ మండపం సచివాలయంగా మార్చి 3 సంవత్సరాలు అవుతుంది. సచివాలయాన్ని అద్దె బిల్డింగ్ లో పెడతాము 6 నెలల్లో కళ్యాణ మండపంను ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. 6 నెలల తర్వాత ప్రభుత్వ ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నపం చేసిన ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. చాలాసార్లు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీడియా ప్రతినిధులు కూడా సహకరించారు దానికి కృతజ్ఞతలు. ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా 24 గంటలు నిరాహార దీక్ష చేసి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనగా 10/12/2022 శనివారం సాయంత్రం 5 గంటల నుండి 11/12/2022 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయుటకు నిర్ణయించాం. మీరందరూ కూడా మా యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా మనవి.