తాళ్ళరేవులో ఘోర రోడ్డు ప్రమాదం – సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్ళరేవు మండలం, కోరంగి పంచాయతీ, సుబ్బారాయుడు దిమ్మ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి చెంది, సంఘటనా స్థలానికి హుటాహుటిన వెళ్లి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది ఆటోలో ప్రయాణిస్తున్నట్టు సమాచారం తెలుసుకుని అందులో ఆరుగురు మృతి చెందినట్లు మరియు ఏడుగురికి తీవ్ర గాయాలు అయినట్లు, చికిత్స పొందుతున్న ఇద్దరిని తాళ్ళరేవు జిజిహెచ్ కి వెళ్లి పరామర్శించి, మరియు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, మిగిలిన ఐదుగురు సభ్యులను కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు మరియు గాయాలపాయాలైన కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే గాయాలపాలయిన వారికి మెరుగైన వైద్యం అందించి మరియు మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం మరియు పోలీసు శాఖ మరియు రవాణా శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.