రామగుండం జనసేన ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రామగుండం, జాతిపిత మహాత్మాగాంధీ 153 వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రావుల సాయికృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రాజ్ కుమార్, రామగుండం మండల యువజన అధ్యక్షులు ఏమూర్ల రంజిత్, ఉపాధ్యక్షులు రవికాంత్, తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోట్ల శశాంక్, రాకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ఆశ్రిత్, సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.