దసరా ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ లంకతలమ్మ అమ్మవారికి నూతనంగా వెండి ఘటం సమర్పించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర అమ్మవారిని దర్శించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమి), మాదాల శ్రీధర్, పితాని రాజు, వట్టూరి బలరాం, కడలి వెంకటేశ్వరరావు, కడలి నాగేశ్వరరావు, అప్పారి సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు.