ఏజెంట్స్ మాయలో పడి పదిహేను మంది యువకులు దుబాయ్ లో చిక్కుకున్నారు

తూర్పుగోదావరి జిల్లా, రావులపాలెం, పాలకొల్లు  తదితర ప్రాంతానికి చెందిన పదిహేను మంది యువకులు ఉద్యోగ మాయలో పడి దుబాయ్ లో వసతి లేక, ఆహారం లేక బిక్కుమంటున్నారు… పూర్తి వివరాలు ఉన్నాయ్. ఏజెంట్(తెలుగు) అనే వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నిరుద్యోగుల ఉన్నారని తెలిసి వారికి మంచి ఉద్యోగం ఉంది అని ఒక్కొక్కరి దగ్గర దాదాపు లక్షా యాభైవేల రూపాయిలు (దాదాపు ఇరవై ఐదు లక్షలు రూపాయలు) వసూలు చేసాడు. వారికి విసిట్ మీద దుబాయ్ తీసుకొచ్చాడు నిరుద్యోగులు అందరు కోటి ఆశలతో విమానాలు ఎక్కి దుబాయ్ లో దిగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెంట్  కొన్ని రోజులు వెయిట్ చేయండి అని నిరుద్యోగులను సముదాయించాడు నెల రోజలు అయినా ఉద్యోగ సమాచారం లేదు డౌట్ వచ్చి నిరుద్యోగులు అతన్ని నిలదీయడంతో అసలు రంగు బయటపడింది… నాకు ఏమి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని యువకులను తిట్టి మొబైల్ ఆఫ్ చేసుకున్నాడు, యువకులకు ఏమిచేయాలో తెలియక నన్ను  సంప్రదించారు… నేను ఏజెంట్ తో సంప్రదించాను. కనీసం వారికి వసతి కలిపించమని అడగడం జరిగింది. నాకు ఏమి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అనడంతో నా మిత్రులు ముక్కు తులసి కుమార్ ని, సోమిరెడ్డిని సంప్రదించి ముగ్గురు కలిసి రాత్రి పది గంటల ప్రాంతంలో నిరాశ్రయుల దగ్గరకి వెళ్లి కలిస్తే వారి పరిస్థితి వసతి లేక రోడ్ మీద ఉండి, ఆహారం లేక దీనస్థితిలో చూసిన మేము చెలించి, రాత్రి పన్నెండు గంటలకి దుబాయ్ పొలిసు వారికి సమాచారం అందించి, వారు వచ్చి వివరాలు సేకరించుకున్నారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నిరాశ్రయులకు భోజనం ఏర్పాటు చేసిన తర్వాత మా లేబర్ క్యాంపుకి మా వాహనంలో పంపి  వసతులు ఏర్పాటు చేసాము. ఏజెంట్స్ ద్వారా మరెవరు మోసపోకూడదు అని ఏజెంట్స్ ని నమ్మి జీవితాలను పడు చేసుకోవద్దని కోరుతున్నాను దేశం కానీ దేశంలో సహాయకోసం బిక్కు బిక్కుమంటూ చూసే పరిస్థితి తెచ్చుకోవద్దు అని నా మనవి చేస్తున్నామని, చివరగా బాధితులు విసిట్ వీసా కలిగి ఉన్నారు మరొక రెండు నెలలు వీసా ఉంది, మన దుబాయ్ లో ఉన్న వ్యాపారస్తులు గాని పెద్దలు గాని సహకరించి సహాయం చేసి(డబ్బు రూపంలో కాదు) అవకాశం ఉంటె వారికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఉపయోగంగా ఉంటుందని నా రిక్వెస్ట్… దయచేసి ఆలోచించండని గల్ఫ్ సేన జనసేన సభ్యులు కేసరి త్రిమూర్తులు అన్నారు.