ప్రజల సమస్యలపై పోరాడుతా: దేవా గౌడ్

తెలంగాణ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, ఇంద్రానగర్ కాలనీ, గ్రామస్తులు పాల్వంచ మండల అధ్యక్షుడు దేవా గౌడ్ కు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండ మరియమ్మ. రాజా, మడ్డి శాంతి, మడ్డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు దేవా గౌడ్ మాట్లాడుతూ ఇంకా ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్య మీద పోరాడుతానని మాట ఇచ్చారు. మన నియోజకవర్గంలో గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని ఆకాంక్షిస్తూ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.