రోడ్డు పక్కన గుంతలను పూడ్చండి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: రోడ్డు పక్కన ప్రమాదకరమైన గుంతలను పూడ్చండి అని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుంచి మడత వెళ్ళే దారిలో రోడ్డుకిరువైపుల మట్టి కొట్టుకుపోయి, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అడుగుమేర మట్టి కొట్టుకు పోయి కాలువగా మారింది. ప్రమాదాలు జరుగకుండా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు చర్యలు తీసుకోని గుంతలను పూడ్చవలసిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, తోడేటి సంపత్, మొలుగూరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.