సినీ, రాజకీయ సవ్యసాచి పవన్ కళ్యాణ్

*ధర్మాన్ని రక్షిస్తూ ప్రజల్ని కాపాడే హరిహర వీరమల్లు
*తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలో ఒదిగిపోయిన పవన్ కళ్యాణ్
*హరిహర వీరమళ్ళు ట్రైలర్ విడుదలతో ఆకాశాన్ని తాకిన అభిమానుల సంబరాలు
*బాణాసంచా కాల్చుతూ… కేక్ కట్ చేసి … పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు

సినీ, రాజకీయ రంగాల్లో సమపాళ్లలో మెరుస్తూ “సవ్యసాచిగా” పేరొందిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ గురువారం భాస్కర్ థియేటర్‌లో విడుదలయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు భారీగా హాజరై కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చుతూ, పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన కార్యదర్శి నాయబ్ కమాల్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒకే సమయంలో సినీ రంగంలో పవర్‌స్టార్‌గా, రాజకీయ రంగంలో ప్రజల హృదయాల్ని గెలుచుకున్న నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. “హరిహర వీరమల్లు” పాత్ర ఆయన నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అధర్మానికి వ్యతిరేకంగా ధర్మాన్ని నిలబెట్టే నాయకుడే పవన్ అని వారు పేర్కొన్నారు. అభిమానుల ఉత్సాహంతో థియేటర్‌ పరిసరాలు పండుగ మయమయ్యాయి. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి చందు, నారదాసు ప్రసాద్, మెహబుబ్ బాషా, పులిగడ్డ నాగేశ్వరావు, మిరియాల వెంకట్, పల్లె పవన్ తదితర జనసేన నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment