రాజానగరం నియోజకవర్గంలో రాక్షసపాలనకు అంతిమయాత్ర
- “బత్తుల” దూకుడు.. ‘జనసేన’ పార్టీ జోష్.. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ స్టామినా.. అడ్రస్ గల్లంతవుతున్న ‘వైసిపి’
- ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో విజయోత్సవ వాతావరణం… సంబరాల్లో జనశ్రేణులు
- బూరుగుపూడిలో బత్తుల వెంకటలక్ష్మికి బ్రహ్మరధం పట్టిన గ్రామ ప్రజానీకం
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. పాదయాత్రలో నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాదయాత్రలో పాల్గొని గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తెచ్చుకుందాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బూరుగుపూడి గ్రామ జనసేన నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-19-at-6.16.49-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-19-at-6.16.50-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-19-at-6.16.50-PM-2-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-19-at-6.16.51-PM-1024x768.jpeg)