ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా అగ్నివీర్ సైనికుడు మురళీ నాయక్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శగా రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం మురళీ నాయక్ తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ పంపిన రూ. 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కల్లి తండా గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అహుడ ఛైర్మన్ టి.సి. వరుణ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జనసేన నేతలు పత్తి చంద్రశేఖర్, కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు కుటుంబానికి జనసేన తరఫున ఇచ్చిన మద్దతు ప్రతి భారతీయుని గుండెల్లో గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది.

Share this content:
Post Comment