కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధికసాయం

ధర్మవరం, ఆర్.సి, యువ ఫౌండేషన్ ద్వారా మొట్ట మొదటి కార్యక్రమంలో భాగంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ధర్మవరం పట్టణంలోని లింగశెట్టిపాళ్యం వీధికి చెందిన చిట్టారి రాఘవేంద్ర అనే చేనేత కార్మికుడికి ఆర్.సి, యువ పౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, ఒక ప్యాకెట్ బియ్యం మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.సి యువ ఫౌండేషన్ అధ్యక్షుడు కె.సుధాకర్ రెడ్డి, ఉప అద్యక్షుడు ఆర్.భవానీ శంకర్, సెక్రటరీ ఎస్.నాగార్జున, రాంచరణ్ ఫాన్స్ రాము, మణికంఠ, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.