జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మాడుగుల, దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందినటువంటి జనసైనికుడు పెంటకోట అప్పలనాయుడు ఇటీవల గుండుపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయపరెడ్డి కృష్ణ మరియు నాలుగు మండలాల జనసైనికుల సహాయ సహకారంతో దేవరపల్లి మండల జనసేన నాయకులు గొర్రుపోటు రామ్మూర్తి నాయుడు, గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో 70 వేల రూపాయలు ఆదివారం వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండలం నాయకులు కొమార హేమంత్, కాశి, సాయి, ప్రసాద్, హనుమంతు, చీడికాడ మండలం జనసేన నాయకులు జి.వి మూర్తి, గుమ్మడి సంతోష్, మజ్జి కృష్ణ కె.కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు, మారపురెడ్డి శివ, కొమర అర్జున్ రావు, హేమంతు, నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.