బ్లడ్ క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం

*ఏలూరు ఆర్యవైశ్య యువజన సంఘం ముందడుగు

ఏలూరు నగరంలోని హీరో షోరూమ్‌లో పనిచేస్తున్న బొత్స శ్రావణ్ కుమార్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో, వైద్య ఖర్చులకు తోడ్పాటు అందించేందుకు ఏలూరు ఆర్యవైశ్య యువజన సంఘం ముందుకొచ్చింది. ఈ మేరకు రూ. 45,000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ దివ్వెల జయబాబు, యువజన సంఘ నాయకుల చేతుల మీదుగా బొత్స శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా బొత్స శ్రావణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో తిరిగి సాధారణ జీవితానికి రాగలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా గారి టీమ్, లింగమల్లు సంతోష్, బలబద్ర విశ్వనాథ్, చలువాది పవన్, కె. పవన్, చలువాది సూర్యనారాయణ, దోపగుంట్ల సత్యనారాయణ, ప్రశాంత్, గొల్ల శ్రీకాంత్, వెనవల్లి రాంప్రసాద్, పాదర్తి రవి, కంభంపాటి రామ్మోహన్ రావు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ ఉదార సహకారం బొత్స శ్రావణ్ కుమార్ కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Share this content:

Post Comment